TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం వ్యక్తం చేసిన తుళ్లూరి బ్రహ్మయ్య ....తల్లికి ఆ దేవుడు ధైర్యం కల్పించాలని కోరిన వైనం.....ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం మనోధర్యం కల్పించడం కొండంత అండ...

మహా క్రాంతి అశ్వాపురం :
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మణుగూరు డిపోలో మహిళా కండక్టర్ విధులు నిర్వహిస్తూ మహిళా ప్రయాణికురాలతో జరిగిన సంఘటనలో బస్సులోంచి కిందపడి గాయాల పాలై హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుండ్ల ప్రవళిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి కుటుంబానికి తీరనిలోటని ఆయన అన్నారు.
ప్రవళిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించడం మృతురాలి తల్లి, కుటుంబానికి కొండంత భరోసాను ఇచ్చిందని పేర్కొన్నారు. 

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అండగా ఉంటామని కలపడం హర్షనీయం :*

ప్రవళిక మృతి చెందిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్దకు వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించడం తోపాటు వారి కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇవ్వడం హర్షించ దగ్గ విషయం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె తల్లికి ఉద్యోగంతో పాటు 10 లక్షలు ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు అలాగే ఆర్టీసీ సంస్థ ద్వారా వచ్చే ఇతర పరిహారాలను అందించేలా చూస్తామనడం మృతురాలి కుటుంబానికి కొండంత భరోసాని ఇచ్చిందన్నారు. ప్రవళిక మృతి అత్యంత బాధాకరమైనప్పటికీ ఆమె తల్లి గర్భశోకాన్ని తట్టుకునేలా ఆ భగవంతుడు ఆమెకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని తుళ్ళూరి కోరారు.

Post a Comment

1 Comments