TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.... ప్రవళిక తల్లిని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్...వారి కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం...

హైదరాబాద్/అశ్వాపురం, మహా క్రాంతి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ,ప్రభుత్వం తోపాటు ఆర్టీసీ నుండి రూ. 10 లక్షల  ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయలు ప్రమాదా భీమా అందనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రి మార్చరి వద్ద ప్రవళిక పార్ధీవ దేహానికి చూడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఆర్టీసీ ఓ కుటుంబ  సభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ సంఘటన జరగగానే మేనేజ్మెంట్ తరఫున ఆసుపత్రికి కూడా వెళ్ళినామన్నారు. అధునాతన చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక మృతి చెందడం బాధాకరమన్నారు.

*ప్రమాదం జరిగిన వెంటనే మెరుగైన వైద్య చికిత్సలకు చర్యలు తీసుకున్నాం :*
 
ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు అందించడంతోపాటు, అదే సందర్భంలో కార్మికుల సంక్షేమము, భద్రత మరింత ప్రాముఖ్యతో ఉందన్నారు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పట్టిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనలో దోషి హత్య ప్రయత్నం కింద ఉందని, ఇప్పుడు హత్య కేసు నమోదు చేసి తగిన విధంగా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగేలా ఎవరూ ప్రయత్నం చేయొద్దు అన్నారు. ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తిస్తుంటుంటే తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటామన్నారు. క్షణికావేశంలో కాంట్రాక్టర్ పై ఆమె ప్రవర్తించిన తీరు, తోసివేయడం వల్ల ఇవాళ ఒక కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది అన్నారు.

 *ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుంది :*
 
విధి నిర్వహణలో ఉండి మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక తల్లికి ఉద్యోగంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ప్రభుత్వం,  ఆర్టీసీ తరఫున 10 లక్షలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం వల్ల వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల్ని వారికి ఆ కంపెన్సేషన్ కింద బ్యాంక్ తరఫున వస్తుందన్నారు. తాము రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎక్కడ కూడా కార్మికుల లోపల అసహనం అనేది లేకుండా వారి పట్ల పెండింగ్ లో ఉన్న అన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

Post a Comment

0 Comments