ఎస్ ఐ ఆర్ అవకతవకలు, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ సందర్భంగా
దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల రక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలియజేయడంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని విపక్ష కూటమి ఈ సభ ద్వారా డిమాండ్ చేయనుంది.
ఓటు ప్రజల హక్కు
రాజ్యాంగ పరిరక్షణకోసం భారీ నిరసన చేపట్టిన కాంగ్రెస్
ప్రజాస్వామ్య పరిరక్షణకోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అప్రజాస్వామికంగా జరుగుతున్న అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ రాంలీల మైదానము వేదికగా భారీగా తలపెట్టిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు అటు ఈసి లేదా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని,
ఎన్నికల ప్రక్రియపై దేశప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా వ్యవహారించాలన్నారు.
ఓటు అనేది ప్రజల హక్కుని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, దేశ ప్రజల పక్షాన అనునిత్యం పోరాటం చేసేందుకు సిద్ధమని చెపుతూ అటు కేంద్రం, ఇటు ఈసి తీరుపై ఆందోళన చేపడుతూ ఢిల్లీ రాంలీల మైదానం నందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ తోట దేవిప్రసన్న, అశ్వారావు పేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments