TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

హైదరాబాద్‌కు ఉదయం వేళల్లోనూ బస్సులు నడపాలి...రాత్రి సర్వీసులతో ప్రయాణికులకు ఇబ్బందులుఆర్టీసీ అధికారులు స్పందించి పగటిపూట సర్వీసులు ప్రారంభించాలి బీజేపీ రాష్ట్ర నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి



మహా క్రాంతి, అశ్వాపురం :

 మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్‌కు ఉదయం వేళల్లోనూ బస్సు సర్వీసులు నడపాలని బీజేపీ నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే హైదరాబాద్‌కు అధికంగా బస్సులు నడపడం వల్ల పగటిపూట ప్రయాణాలు చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు ప్రాంతం నుంచి నిత్యం అనేక మంది ప్రజలు ఉద్యోగ, వ్యాపార, వైద్య, విద్యా అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా ప్రయాణంలో అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. మణుగూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు కాకముందు నుంచే కొత్తగూడెం, ఖమ్మం డిపోల నుంచి హైదరాబాద్‌కు బస్సు సర్వీసులు నడిచేవని గుర్తుచేశారు. అలాంటిది మణుగూరు డిపో ఉన్నప్పటికీ ఉదయం నుంచి పగటిపూట సరిపడా సర్వీసులు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే బస్సులు నడిపితే అన్ని వర్గాల ప్రయాణికులకు ఎలా సౌకర్యం కలుగుతుందని ఆయన ప్రశ్నించారు. అత్యవసర పనులు, వైద్య చికిత్సలు, ఇతర అవసరాల కోసం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లి అదే రోజు పనులు ముగించుకుని తిరిగి రావాలనుకునే వారికి పగటిపూట సర్వీసులు ఎంతో అవసరమన్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మణుగూరు నుంచి హైదరాబాద్‌కు ఉదయం వేళల్లో కనీసం ఒకటి, రెండు సర్వీసులైనా ప్రారంభించాలని, అవసరానికి అనుగుణంగా పగటిపూట బస్సుల సంఖ్య పెంచి, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని అని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆయన కోరారు.

Post a Comment

0 Comments