TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పత్రికలు సమాజ శ్రేయస్సుకోసం పనిచేయాలి...విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి అవసరం....మహా క్రాంతి తెలుగు డిజిటల్ దిన పత్రిక ప్రారంభంలో డి.ఎస్.పి వంగా రవీందర్ రెడ్డి...


మహా క్రాంతి,అశ్వాపురం :

పత్రికలు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని మణుగూరు డిఎస్పి వంగా రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం మణుగూరులోని ఆయన కార్యాలయంలో ఎంకే న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కొడారి వెంకటేశ్వర్లు నిర్వహించ తలపెట్టనున్న తెలుగు డిజిటల్ పత్రికను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం డిజిటల్ మీడియా వైపు పరుగులు పెడుతుందన్నారు. మీడియా సంస్థలు, ప్రతినిధులు నిబంధనలకు లోబడి సమాజంలోని మంచిని, చెడుని తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని ఆయన కోరారు. పత్రికలు సమాజ హితం కోసం అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తేనే ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహా క్రాంతి డిజిటల్ తెలుగు దినపత్రిక ప్రజలకు చేరువగా వారి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య అశ్వాపురం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి త్రిపురారి నెహ్రూ, ప్రచార కార్యదర్శి దేపంగి వెంకటరమణ, నవతెలంగాణ రిపోర్టర్ దామర్ల వెంకన్న, నేటి కేసరి విలేఖరి ఎస్కే నయీమ్, ఇరుగు సంతోష్ పాల్గొన్నారు..

Post a Comment

0 Comments