TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

గోదావరి నుండి ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులు...!రాత్రింబవళ్లు తేడా లేకుండా కొనసాగుతున్న ఇసుక రవాణా.....అక్రమ ఇసుక రవాణాపై అధికారులు నిర్లక్ష్యం ఎందుకంటున్న జనం ? మచ్చుకైనా కనిపించని సంబంధిత శాఖల అధికారులు




అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల సమీపంలో గల గోదావరి నది నుండి గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. గోదావరి నదికి అనధికారికంగా ర్యాంపును వేసిన కొందరు అక్రమ ఇసుక రవాణా దారులు ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో గోదావరి నుండి ఇసుకను తరలిస్తున్నారు. రాత్రివేళల్లో ఏకంగా జెసిబి యంత్ర సహాయంతో ట్రాక్టర్లకు ఇసుకను లోడ్ చేస్తూ తరలిస్తూ ఇష్టానుసారంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ట్రాక్టర్ ఇసుకకు దూరాన్ని బట్టి రూ. 25 వందల నుండి 3 వేల వరకు అమ్ముతున్నారని మండలంలోని పలువురు చెబుతున్నారు.

*మచ్చుకైనా కనిపించని మైనింగ్ శాఖ అధికారులు :*

ప్రభుత్వానికి ఆదాయం సమకూరే పకృతి సంపదలో ఒకటైన ఇసుకను గోదావరి నది నుండి అక్రమార్కులు విచ్చలవిడిగా తరలించుకు వెళుతున్న సంబంధిత మైనింగ్ అధికారులు మచ్చుకైనా కనిపించకపోవడంపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చింతిర్యాల గోదావరి నది నుండి రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా గోదావరి నది వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద అవసరాలకు ఇసుకను తీసుకు వెళ్తుంటే అడ్డుకుని కేసులు నమోదు చేసే సంబంధిత శాఖల అధికారులకు ఈ ఆక్రమణదారులు గోదావరి నుండి తరలిస్తున్న ఇసుక రవాణా ఎందుకు కనిపించడం లేదని..? మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

*అక్రమ రవాణాను అడ్డుకోవాలి: ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షులు కల్లూరి నరసింహారావు*

చింతిర్యాల గోదావరినది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై అధికారులు చర్యలు చేపట్టాలని ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షుడు కల్లూరి నరసింహారావు అన్నారు. అటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా అలాగే పంచాయతీ అభివృద్ధికి వనరులు సమకూర్చకుండా గోదావరి ద్వారా వస్తున్న సంపదను అక్రమార్కులు నిర్వీర్యం చేయడం పై అధికారులు అడ్డుకట్ట వేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments