TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

మీసేవ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ శూన్యం... పంచాయతీలలో ఉండాల్సిన మీ సేవలు మండల కేంద్రంలోకి... ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్న మీసేవ నిర్వాహకులు.... పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు... బిఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు వెన్న అశోక్ కుమార్.

మహా క్రాంతి-అశ్వాపురం :

మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరవు కావాలన్నా ఉద్దేశంతో మంజూరి చేసిన మీసేవ కేంద్రాలు ప్రజాసేవను మరచి వ్యాపార కేంద్రాలుగా విరజిల్లుతున్నాయని బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు వెన్న అశోక్ కుమార్ ఆరోపించారు. గ్రామపంచాయతీలకు మంజూరైన మీసేవల ద్వారా ప్రజలకు చేపట్టాల్సిన కార్యకలాపాలను నిర్వాహకులు ఎందుకు మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు అధికారులు చెప్పాలని ఆయన అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో మీసేవల నిర్వహణ తీరు అత్యంత దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ సేవల ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మీసేవ ఆపరేటర్లు మంగళం ఆడుతూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆయన తెలిపారు.
అశ్వాపురం మండలంలో మీసేవ కేంద్రాల నిర్వహణ, సేవల ధరలపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. రెవెన్యూ కార్యాలయాల ద్వారా ప్రజలు పొందాల్సిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు పౌరులకు రెవెన్యూ శాఖ ద్వారా అందించాల్సిన మరికొన్ని ధ్రువీకరణ, భూ విభాగాలకు సంబంధించిన సేవల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయించే ప్రజల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తున్నారని ఆయన ఆయన తెలిపారు. ప్రతి మీసేవ కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన సేవల ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలని, నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేసే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మండలంలో ఎన్ని మీసేవ కేంద్రాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ మంజూరు చేశారో ? వాటిని ఏయే గ్రామాలు, ప్రాంతాలకు మంజూరు చేషారన్న అంశాలపై అధికారులు పరిశీలన చేసి కేటాయించిన ప్రాంతాలలోనే మీసేవ కేంద్రాలు నిర్వహణ జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారని, తద్వారా రెవెన్యూ ద్వారా పౌరులు పొందాల్సిన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మరింత సౌలభ్యతగా ఉంటుందని ఆయన అన్నారు. పంచాయతీలలో సేవలందించేందుకు మంజూరు చేసిన మీసేవ కేంద్రాలు మండల కేంద్రంలో నిర్వహణ చేపట్టడం వలన ప్రజలు మండలం నలుమూలల నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మండల కేంద్రానికి ధ్రువీకరణ పత్రాల కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తద్వారా ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, అంతేకాకుండా మీసేవ కేంద్రాల నిర్వహణపై రెవెన్యూ శాఖ అధికారులు పర్యవేక్షణ చేపట్టకపోవడం వలన ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కేటాయించిన ప్రాంతాలలోనే మీ సేవలు నిర్వహణ జరిగేలా చర్యలు చేపట్టడంతో పాటు ధరల పట్టిక బోర్డులను ప్రజలకు కనిపించేలా మీ సేవ కేంద్రాలలో ఏర్పాటు చేయించాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments