MKNEWS, మణుగూరు: మాజీ ఎంపీ మిడియం బాబూరావు సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. మణుగూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సాధారణ ప్రయాణికుడిగా కనిపించిన ఆయన, మాజీ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రజలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రజా జీవితంలో నిరాడంబరతకు ప్రాధాన్యతనిస్తూ, సామాన్యుల మధ్యే ఉంటూ ప్రయాణించిన కమ్యూనిస్టు నాయకుడు మిడియం బాబూరావును పలువురు అభినందిస్తున్నారు. పదవులు మారినా ప్రజలతో అనుబంధం మారకూడదనే సందేశాన్ని ఆయన తన ప్రయాణంతో చాటిచెప్పారు.
0 Comments