రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి....
ఎంకే న్యూస్, అశ్వాపురం :
అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రాన్ని అందజేశారు. మంచి కంటి నగర్ నుండి ఆర్ అండ్ బి ప్రధాన రహదారి వరకు ఒకటి, అలాగే కాలవబజార్ లోని రాయపూడి రాజేష్ ఇంటి నుండి ముస్లిం కాలనీ మీదుగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వరకు ఉన్న కచ్చా రోడ్లను ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ రెండు రహదారులు సుమారు 500 మీటర్లు కలిగి ఉంటాయని ఈ రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాలుగు చినుకులు పడితే నడవలేని విధంగా రోడ్లు తయారవుతున్నాయని ఆయన తెలిపాడు. ఈ రహదారులు ప్రజలకు అత్యంత కీలకమైనవని ఒకటి గ్రామానికి వెళ్లేందుకు ప్రజలకు సౌకర్యవంతంగా కలిగేందుకు కాగా మరొకటి ఆరోగ్య పరిస్థితులు వికటించిన సందర్భంలో ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రధానమైన మార్గాలుగా ఉన్నాయని ఆయన వినతిపత్రంలో వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా ఈ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
Comments
Post a Comment